Harikrishna: హరికృష్ణ ఆఖరి సందేశం, తీరని కోరికలివి!

  • మరణానికి మూడు రోజుల ముందే అభిమానులకు లేఖ
  • కేరళకు విరాళాలు ఇవ్వాలని సందేశం
  • ఇంకో సినిమా చేస్తే, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతోనే
  • నెరవేరకుండా మిగిలిపోయిన కోరిక

బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ హఠాన్మరణం చెందగా, అంతకు మూడు రోజుల ముందే ఆయన సందేశం (అదే ఆఖరిదని ఎవ్వరూ అనుకోలేదు) మీడియాకు చేరింది. ఆయన తన స్వహస్తాలతో, సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజుకు వేడుకల పేరిట ఎవరూ డబ్బు ఖర్చు చేయవద్దని, ఆ డబ్బును కేరళకు విరాళంగా ఇవ్వాలని అభిమానులను కోరారు. అదే ఇప్పుడు ఆయన ఆఖరి సందేశంగా మారిపోయింది.

ఇక ఆయన తీరని కోరిక కూడా ఒకటి మిగిలిపోయింది. తండ్రి నట వారసత్వాన్ని సైతం పుణికి పుచ్చుకున్న ఆయన, పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. చివరిగా ఆయన కృష్ణతో కలసి 'శ్రావణమాసం' చిత్రంలో నటించారు. ఆపై పలువురు దర్శకులు హరికృష్ణను తమ చిత్రాల్లో నటించాలని కోరినా, ఆయన సున్నితంగా నిరాకరిస్తూ వచ్చారు. మళ్లీ సినిమా అంటూ చేస్తే, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కలసి నటించే చిత్రంలో మాత్రమే నటిస్తానని స్పష్టంగా చెప్పారు. ఆయన కోరిక తీరకుండానే అనంతలోకాలకు చేరిపోవడం గమనార్హం.

Harikrishna
Kalyanram
NTR
Road Accident
  • Loading...

More Telugu News