SPICE JET: విమానంలో ఎయిర్ హోస్టెస్ ను వేధించిన ప్రబుద్ధుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • స్పైస్ జెట్ విమానంలో ఘటన
  • ఉద్యోగినితో అసభ్య ప్రవర్తన
  • పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసులు, అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పోకిరీలు మాత్రం మారడం లేదు. బస్సు, రైలు, విమానం తేడా లేకుండా మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ ను వేధించాడు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు గురువారం స్పైస్ జెట్ విమానం బయలుదేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఈ సందర్భంగా ఓ మహిళా ఎయిర్ హోస్టెస్ ను వేధించాడు. దీంతో బాధితురాలు పైలెట్ కు ఫిర్యాదు చేసింది. దీంతో అతను శంషాబాద్ విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(సీఐఎస్ఎఫ్) అధికారులకు సమాచారం అందించాడు. చివరికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ కాగానే అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు.. విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు.

SPICE JET
HARRASMENT
AIR HOSTEES
AIRLINES
New Delhi
Hyderabad
  • Loading...

More Telugu News