Kiki: విమానాన్ని స్టార్ట్ చేసి, మహిళా పైలెట్ 'కికి' డ్యాన్స్... దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!

  • విమానాలకూ పాకిన 'కికి' డ్యాన్స్
  • చార్టెడ్ ఫ్లయిట్ ను ఆన్ లో ఉంచి కిందకు దిగిన పైలట్
  • హర్షనీయం కాదంటున్న నెటిజన్లు

ఇప్పటివరకూ కార్లకే పరిమితమైన 'కికి' డ్యాన్స్, ఇప్పుడు విమానాలకూ పాకింది. మెక్సికోలో ఓ చార్టెడ్ విమానం వెళుతుండగా, డోర్లు తీసుకుని బయటకు వచ్చిన ఇద్దరు మహిళలు డ్యాన్స్ చేస్తూ, విమానం వెంట సాగుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. విమానాన్ని స్టార్ట్ చేసి, అది ముందుకు సాగుతుండగా, కాక్ పీట్ లో నుంచి బయటకు లేచి వచ్చిన మహిళా పైలట్, విమానంలోని మరో యువతి, దర్జాగా మెట్లు దిగి, డ్యాన్స్ మొదలు పెట్టారు. దీన్ని వీడియో తీసిన వారు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయగా, వారు చేసిన పని ఏ మాత్రం హర్షణీయం కాదంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

Kiki
Flight
Dance
Pilot
  • Error fetching data: Network response was not ok

More Telugu News