Gannavaram: విజయవాడకు వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి!

  • గన్నవరంలో స్వాగతం పలికిన అధికారులు
  • కనకదుర్గమ్మను దర్శించుకోనున్న కర్ణాటక సీఎం
  • నిన్నటికి సీఎంగా 100 రోజులు

కర్ణాటక సీఎం కుమారస్వామి ఈ ఉదయం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆయనకు మంత్రులు, ప్రొటోకాల్ అధికారులు, పలువురు అభిమానులు స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆయన ఇంద్రకీలాద్రి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కుమారస్వామి రాక సందర్భంగా దుర్గ గుడి వద్ద భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శ్రావణ శుక్రవారం కావడంతో కొండపై భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంది. నిన్నటితో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే.

Gannavaram
Vijayawada
Indrakeeladri
Kanakadurga
Kumaraswamy
  • Loading...

More Telugu News