delhi: ముగిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం
- కాంగ్రెస్ నేత చిదంబరం నేతృత్వంలో జరిగిన సమావేశం
- టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరు
- విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న ఒడిశా బీజేడీ ఎంపీ?
ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏపీ పునర్ విభజన చట్టం అమలుపై వివిధ శాఖల నుంచి వివరాలను కమిటీ తీసుకుంది. ఏపీకి ప్రత్యేకహోదా, రెవెన్యూలోటు భర్తీ, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు అంశాలను రామ్మోహన్ నాయుడు లేవనెత్తినట్టు సమాచారం.
విభజన చట్టంలోని హామీలు పరిశీలనలో ఉన్నట్లు కమిటీకి పలు శాఖలు తెలిపాయి. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని ఒడిశా బీజేడీ ఎంపీ కోరినట్టు తెలుస్తోంది. కేంద్రం స్పందించిన తీరుపై స్టాండింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, స్టాండింగ్ కమిటీ త్వరలోనే తుది నివేదిక తయారు చేయనున్నట్టు తెలుస్తోంది.