Rahul Gandhi: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి వందరోజులు!

  • సీఎం కుమారస్వామి పాలనకు వందరోజులు 
  • ఢిల్లీలో రాహుల్ ని కలిసిన వైనం
  • పుష్పగుచ్ఛం అందజేసి కృతఙ్ఞతలు చెప్పిన కుమారస్వామి

కర్ణాటక సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి నూరు రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో కుమారస్వామి గద్దె నెక్కిన విషయం తెలిసిందే. తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ వెళ్లి కలిశారు. రాహుల్ కు పుష్పగుచ్ఛం అందజేసిన కుమారస్వామి కృతఙ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, సంకీర్ణ ప్రభుత్వంలో తన కష్టాల గురించి మీడియా ముందు ఓసారి ఆయన కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే.  

Rahul Gandhi
Karnataka
cm
kumaraswamy
  • Loading...

More Telugu News