mohanbabu: హరిక‌ృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మోహన్ బాబు!

  • అమెరికాలో ఉన్న మోహన్ బాబు 
  • తననెంతో ప్రేమగా చూసుకున్నాడన్న మోహన్ బాబు 
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నటుడు హరిక‌ృష్ణ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. తన జీవితంలో అత్యంత విలువైనదాన్ని కోల్పోయానని నిన్న ఆవేదన వ్యక్తం చేసిన మోహన్ బాబు తాజాగా హరిక‌ృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

'నేను ఇండియాలో లేను, అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు... మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్ లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు... ఆ రోజు మొదలైన మా అనుబంధం ఈ నాటికీ కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, మరికాసేపట్లో ఫిలిం నగర్ మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

mohanbabu
harikrishna
Hyderabad
Tollywood
Telugudesam
  • Loading...

More Telugu News