hari krishna: జనసంద్రంగా మారిన అంతిమయాత్ర రోడ్డు.. జోహార్ హరికృష్ణ అంటూ నినాదాలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8991be32a95ca015da67ad8305a663d8deeb8bcd.jpg)
- చివరి చూపుకోసం భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు
- హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు
- సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
దివంగత హరికృష్ణ అంతిమయాత్ర మెహిదీపట్నంలోని నివాసం వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్డు జనసంద్రంగా మారాయి. అశేషమైన అభిమానులతో రోడ్లు నిండిపోయాయి. హరికృష్ణ చివరి చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ అమర్ రహే... జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-6acad1ed4cc09145dbacacb5e6075abf68d73bbf.jpg)