hari krishna: హరికృష్ణకు నివాళి అర్పించిన వైసీపీ నేతలు

  • నివాళి అర్పించిన మేకపాటి, వైవీ, విజయసాయి, అంబటి, చెవిరెడ్డి
  • హరి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్న వైవీ సుబ్బారెడ్డి
  • ఎత్తుగడలు తెలియని మంచి వ్యక్తి అన్న మేకపాటి

దివంగత నందమూరి హరికృష్ణకు వైసీపీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అంబటి రాంబాబులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిబ్యూరో సభ్యులు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు. హరికృష్ణ ఆత్మకు శాంతి  చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.

మేకపాటి మాట్లాడుతూ, హరికృష్ణ గొప్ప మనసున్న వ్యక్తి అని, నిక్కచ్చిగా మాట్లాడే గుణం కలవారని చెప్పారు. ఒక మంచి వ్యక్తి చనిపోవడం దురదృష్టకరమైన విషయమని అన్నారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఎత్తుగడలు తెలియని వ్యక్తి అని కొనియాడారు. తెలుగువారందరికీ ఒక మంచి వ్యక్తిగా ఆయన తెలుసని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నామని చెప్పారు.   

hari krishna
ysrcp
leaders
condolence
  • Loading...

More Telugu News