hari krishna: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు హరికృష్ణ భౌతికకాయాన్ని ఎందుకు తీసుకెళ్లలేదంటే..!

  • శ్మశాన వాటికకు తీసుకెళ్లే ముందు పార్థివదేహానికి స్నానం చేయించాలి
  • పార్టీ కార్యాలయానికి తరలిస్తే.. మళ్లీ ఇంటికి తీసుకురావాలి
  • ఈ క్రమంలో పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం

టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడైన దివంగత హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్లాలని తొలుత భావించారు. పార్టీ కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించాలని అనుకున్నారు. కానీ, పార్టీ కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లలేదు.  

ఎందుకంటే, శ్మశాన వాటికకు తీసుకెళ్లే ముందు భౌతికకాయానికి స్నానం చేయించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ భవన్ కు తీసుకెళితే మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదంతా ఇబ్బందులతో కూడిన వ్యవహారం కావడంతో, భౌతికకాయాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకురాలేదని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

hari krishna
ntr trust bhavan
funerals
  • Loading...

More Telugu News