lakshmi parvathi: తల్లిదండ్రుల ఫొటోతో ఆగ్రహంగా వచ్చిన హరికృష్ణ.. వెనక్కి తగ్గిన లక్ష్మీ పార్వతి అనుచరులు!

  • ఎన్టీఆర్ మృతి సందర్భంగా ఘటన
  • ఎల్బీ స్టేడియంలో చంద్రబాబును అడ్డుకున్న వైనం
  • అక్కడకు ఆగ్రహంతో చేరుకున్న హరికృష్ణ

  తండ్రి ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో నందమూరి హరికృష్ణ విదేశాల్లో ఉన్నారు.  ఆ సమయంలో ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి వర్గీయులు చంద్రబాబు వర్గీయులను అక్కడకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు కూడా దూరంగా కూర్చోవాల్సి వచ్చింది.

తండ్రి మరణవార్త తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్న హరికృష్ణ.. తల్లిదండ్రులు బసవతారకం, ఎన్టీఆర్ ఉన్న ఫొటో పట్టుకుని స్టేడియానికి వచ్చేశారు. ఆగ్రహంగా అక్కడకు వస్తున్న హరికృష్ణను అడ్డుకునే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. హరికృష్ణ రాకతో లక్ష్మీ పార్వతి వర్గీయులు వెనక్కి తగ్గారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం ఎన్టీఆర్ అంత్యక్రియలను నిర్వహించింది. 

lakshmi parvathi
ntr
hari krishna
lb stadium
  • Loading...

More Telugu News