hari krishna: చైతన్య రథ సారథిగా ఉన్న కృష్ణుడు మన నుంచి వెళ్లిపోయారు: గవర్నర్ నరసింహన్

  • భౌతికకాయానికి నివాళులర్పించిన నరసింహన్
  • కుటుంబసభ్యులకు పరామర్శ
  • హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలన్న గవర్నర్

నందమూరి హరికృష్ణ మృతిపై గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించిన అనంతరం, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం, మీడియాతో నరసింహన్ మాట్లాడుతూ, చైతన్య రథ సారథిగా ఉన్న కృష్ణుడు మన నుంచి వెళ్లిపోయారని, హరికృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. హరికృష్ణ  మృదు స్వభావి అని చెప్పిన నరసింహన్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

hari krishna
governer narasimhan
  • Loading...

More Telugu News