ntr: కల్యాణ్ రామ్ అలా అనుకున్నాడు .. ఇంతలోనే ఈ ఘోరం!

  • తండ్రితో ఓ సినిమా చేయాలనుకున్న కల్యాణ్ రామ్ 
  • తాను .. ఎన్టీఆర్ కలసి ఆయనతో తెరపై కనిపించాలనే ఆలోచన 
  • ఆ దిశగా మొదలైన ప్రయత్నాలు

ఒక వైపున నిర్మాతగా .. మరో వైపున హీరోగా కల్యాణ్ రామ్ బిజీగా వున్నాడు. ఈ మధ్య ఎన్టీఆర్ తో ఆయన నిర్మించిన 'జై లవకుశ' భారీ విజయాన్ని సాధించింది. హీరోగా ఈ సినిమా ఎన్టీఆర్ లోని నటుడిని కొత్త కోణంలో చూపించగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కి కాసుల వర్షం కురిపించింది. దాంతో సొంత బ్యానర్లో తండ్రితో కలిసి తాను .. ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తే బాగుంటుందని కల్యాణ్ రామ్ భావించాడు. తమ ముగ్గురి పాత్రలను ప్రధానంగా చేసుకుని ఒక కథను సిద్ధం చేయమని కూడా ఆయన కొంతమంది రచయితలకు చెప్పాడట.

కథ కుదిరితే తండ్రితో కలిసి నటించాలనే ఆసక్తిని ఎన్టీఆర్ కూడా కనబరిచాడు. కానీ ఈ లోగానే ఘోరం జరిగిపోయింది .. ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ కోరిక నెరవేరకుండా వాళ్లకి హరికృష్ణ శాశ్వతంగా దూరం కావడం నిజంగా విచారించదగిన విషయం.      

ntr
kalyan ram
harikrishna
  • Loading...

More Telugu News