Chandrababu: బయటి వరకు వచ్చి కేసీఆర్ కు వీడ్కోలు పలికిన చంద్రబాబు

  • హరికృష్ణకు నివాళి అర్పించిన కేసీఆర్
  • అనంతరం మాట్లాడుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు
  • వీడ్కోలు పలికి లోపలకు వెళ్లిపోయిన చంద్రబాబు

మెహిదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు కూడా నివాళి అర్పించారు. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారు. అనంతరం కేసీఆర్ తో పాటు చంద్రబాబు కూడా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కేసీఆర్ ఏదో చెప్పడం జరిగింది. అనంతరం కేసీఆర్ కు వీడ్కోలు పలికి చంద్రబాబు లోపలకు వెళ్లిపోయారు. 

Chandrababu
kcr
harikrishna
meet
  • Loading...

More Telugu News