akhil: అఖిల్ ఫస్టులుక్ .. చైతూ ట్రైలర్ రిలీజ్ లు ఆగిపోయాయి

- అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి మూవీ
- పరిశీలనలో 'మిస్టర్ మజ్ను' టైటిల్
- చైతూ హీరోగా 'శైలజా రెడ్డి అల్లుడు'
అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ రోజున నాగార్జున పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని భావించారు. కానీ నందమూరి హరికృష్ణ చనిపోవడం వలన, నాగ్ తన బర్త్ డే వేడుకలను రద్దు చేసుకున్నారు .. అఖిల్ ఫస్టులుక్ రిలీజ్ ఆలోచనను విరమించుకున్నారు.
