Chandrababu: హరికృష్ణ భౌతికకాయం వెంటే వస్తున్న చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్

  • హైదరాబాదుకు హరికృష్ణ భౌతికకాయం తరలింపు
  • భౌతికకాయం వెంటే వస్తున్న చంద్రబాబు, లోకేష్, తారక్
  • రోడ్డు మార్గంలో కట్టుదిట్టమైన భద్రత

తన బావమరిది హరికృష్ణ మరణవార్తతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆసుపత్రిలో ఆయన భౌతికకాయాన్ని చూసి, కంటతడి పెట్టారు. మరణ వార్త వినగానే ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన నార్కట్ పల్లికి వచ్చారు. చంద్రబాబు తుది చూపు కోసం హరికృష్ణ పోస్ట్ మార్టంను కూడా కాసేపు వాయిదా వేశారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని హైదరాబాదుకు తరలించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ లో ఎక్కకుండా... హరి భౌతికకాయంతో పాటే చంద్రబాబు రోడ్డు మార్గంలో వస్తున్నారు. ఆయనతో పాటు నారా లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు కూడా భౌతికకాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణానికి అంతరాయం కలగకుండా రూట్ క్లియరెన్స్ ఇచ్చారు.

Chandrababu
harikrishna
junior ntr
  • Loading...

More Telugu News