mohanbabu: నా జీవితంలో అత్యంత విలువైనదాన్ని కోల్పోయా: మోహన్ బాబు

  • నా సోదరుడిని కోల్పోయా
  • ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు
  • ఇంతకు మించిన లోటు నాకు మరేదీ లేదు

నందమూరి హరికృష్ణ మరణవార్తతో ప్రముఖ నటుడు మోహన్ బాబు తీవ్రంగా కలత చెందారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన సోదరుడిని కోల్పోయానని, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని చెప్పారు. తన జీవితంలో అత్యంత విలువైనదాన్ని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నందమూరి కుటుంబంతో మోహన్ బాబుకు ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకరిగా మోహన్ బాబు మెలుగుతుంటారు. ఈ నేపథ్యంలో, హరికృష్ణ మరణంతో ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. ఇంతకు మించిన లోటు తనకు మరేదీ లేదని చెప్పారు.

mohanbabu
harikrishna
  • Loading...

More Telugu News