harikrishna: రాయిపై ఎక్కడంతోనే కారు అదుపు తప్పింది.. హరి ఎగిరి బయట పడిపోయారు!: ప్రాణాలతో బయటపడ్డ స్నేహితుడి ఆవేదన

  • వివరాలు వెల్లడించిన మిత్రుడు శివాజీ
  • హరి సీటు బెల్టు పెట్టుకోలేదని వెల్లడి
  • సీటు బెల్టుతో బతికిపోయానని వ్యాఖ్య

నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు బోల్తా పడటంతో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరు స్నేహితులు ఆరెకపూడి శివాజీ, వెంకట్రావులు కారులోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయాలతో వీరిద్దరూ బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై తాజాగా ఆరెకపూడి శివాజీ స్పందించారు.

నెల్లూరు జిల్లా కావలిలో ఓ వివాహ వేడుకకు హాజరు అయ్యేందుకు తాము ఉదయం 4.30 గంటలకు కారులో బయలుదేరామని శివాజీ తెలిపారు. హరి పక్కన తాను కూర్చున్నానని, వెనుక వెంకట్రావు ఉన్నాడని వెల్లడించారు. కారు వేగంగా వెళుతుండగా రోడ్డుపై ఉన్న రాయిపైకి కారు ఎక్కిందనీ, దీంతో వాహనం అదుపు తప్పిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ఎరిగి బయటపడ్డారనీ, సీటు బెల్టు పెట్టుకోవడంతో తామిద్దరం ప్రాణాలతో బయటపడ్డామని వెల్లడించారు.

harikrishna
Road Accident
Andhra Pradesh
Telangana
friends
  • Loading...

More Telugu News