harikrishna: ముగ్గురితో కలసి వెళ్లడాన్ని హరికృష్ణ అశుభంగా భావించేవారు..!: స్నేహితుడు ప్రకాశ్

  • హరి చాలా జాగ్రత్తగా ఉండేవారు
  • ఈ రోజు కారులో నేనూ వెళ్లాలి
  • ప్రయాణంలో నలుగురు ఉండాల్సిందే

బయటకు వెళ్లేటప్పుడు హరికృష్ణ చాలా జాగ్రత్తగా ఉండేవారని ఆయన స్నేహితుడు ప్రకాశ్ తెలిపారు. హరి ఎప్పుడూ ముగ్గురితో కలసి వెళ్లేవారు కాదనీ, మూడు సంఖ్యను ఆయన అశుభంగా భావించేవారని వెల్లడించారు. తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై ప్రకాశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

హరికృష్ణ మూడు సంఖ్యను దురదృష్టంగా భావించేవారనీ, ఎప్పుడు బయటకు వచ్చినా నలుగురితో కలసి వెళ్లేలా చూసుకునేవారని వెల్లడించారు. ఈ రోజు కావలిలో పెళ్లి వేడుకకు వెళదామని హరి తనకు చెప్పారనీ, ఆయన ఫోన్ కాల్ కోసం తాను ఎదురుచూస్తూ ఉన్నానని తెలిపారు.

ఇంతలోనే హరికృష్ణ మరణవార్త వినాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. తొలుత నలుగురం కలసి పెళ్లికి వెళదామని అనుకున్నామనీ, కానీ ఆయన మరో ఇద్దరితో కలసి ఎందుకు బయలుదేరారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

harikrishna
Road Accident
friend
prakash
  • Loading...

More Telugu News