Chandrababu: కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు.. సీఎం కాన్వాయ్ లో టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి

  • ఉండవల్లి నుంచి నార్కట్ పల్లికి చేరుకున్న చంద్రబాబు
  • ఆసుపత్రిలో ఉన్న బాలయ్య, తారక్, కల్యాణ్ రామ్, జగపతిబాబు
  • నందమూరి కుటుంబసభ్యులను తప్ప లోపలకు మరెవరినీ అనుమతించని పోలీసులు

తన బావమరిది నందమూరి హరికృష్ణ ప్రమాద వార్తతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ లో బయల్దేరారు. కాసేపటి క్రితమే ఆయన నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద బాలకృష్ణ, కల్యాణ్ రామ్, జగపతిబాబు తదితరులు ఉన్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలోకి నందమూరి కుటుంబసభ్యులు, వీవీఐపీలను తప్ప మరెవరినీ పోలీసులు అనుమతించడం లేదు. గేటు బయటే అందరినీ ఆపేస్తున్నారు. ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. 

Chandrababu
nandamuri harikrishna
  • Loading...

More Telugu News