nandamuri harikrishna: చాలా డిస్టర్బ్ అయ్యా: కేటీఆర్... ఎంతో బాధ కలుగుతోంది: రోజా

  • హరికృష్ణ మరణవార్తతో ఎంతో ఆవేదనకు గురయ్యానన్న కేటీఆర్
  • తారక్, కల్యాణ్ రామ్ లకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి
  • షాక్ కు గురయ్యానన్న రోజా

నందమూరి హరికృష్ణ హఠాన్మరణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'హరికృష్ణ గారి మరణ వార్తతో ఎంతో ఆవేదనకు గురయ్యా. మనసంతా చాలా డిస్టర్బ్ అయింది. నందమూరి కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతున్నా. ప్రియ సోదరులు తారక్, కల్యాణ్ రామ్, ఇతర కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి' అంటూ ట్వీట్ చేశారు.

హరికృష్ణ మరణవార్తతో షాక్ కు గురయ్యానని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. వార్త తెలియగానే ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

nandamuri harikrishna
KTR
roja
  • Loading...

More Telugu News