Road Accident: హరికృష్ణ మృతికి అసలు కారణం... పోలీసుల ఎఫ్ఐఆర్ వివరాలు!

- ప్రమాదానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే
- కారులోని మిగతావారు బెల్ట్ పెట్టుకున్నందునే బతికారు
- పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి
అత్యంత వేగంగా కారులో ప్రయాణిస్తున్న వేళ, సీటు బెల్టు పెట్టుకోకపోవడమే హరికృష్ణ మరణానికి కారణమైందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారు ప్రమాదానికి గురైన వేళ, ఆయన ఎగిరి రోడ్డుపై పడ్డారని, ఆ కారణంతోనే మెదడుకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో మరణించారని పోలీసులు ప్రాథమిక రిపోర్టులో పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే, ఆయన బయటకు విసిరివేయబడివుండేవారు కాదని, కారులోని మిగతావారి మాదిరే ప్రాణాలతో బయటపడివుండేవారని చెబుతున్నారు.
