Bhuvaneshwari: హరికృష్ణ ఇంటికి భువనేశ్వరి... పట్టుకుని బోరున విలపించిన లక్ష్మి!

  • బ్రహ్మణితో కలసి హరికృష్ణ ఇంటికి భువనేశ్వరి
  • అప్పటికే చేరుకున్న పలువురు బంధుమిత్రులు
  • ఆడపడుచును చూసి విలపించిన హరికృష్ణ సతీమణి

నందమూరి హరికృష్ణ మరణ వార్తను తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తన కోడలు బ్రహ్మణిని వెంటబెట్టుకుని హైదరాబాద్, మెహిదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు నందమూరి కుటుంబ బంధుమిత్రులు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. లోనికి వెళ్లిన భువనేశ్వరిని చూసిన హరికృష్ణ సతీమణి లక్ష్మి, ఆమెను పట్టుకుని బోరున విలపించారు. ఆమెను ఓదార్చడం అక్కడున్న ఎవరి వల్లా కావడం లేదు. నందమూరి కుటుంబంలో మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తారని భావించలేదని బయట విషణ్ణ వదనాలతో వేచి చూస్తున్న అభిమానులు అంటున్నారు.

Bhuvaneshwari
Brahmani
Lakshmi
Harikrishna
Road Accident
  • Loading...

More Telugu News