Harikrishna: నన్ను చూసి చాలా రోజులయిందన్నాడు... 'కలవాలి తమ్ముడూ' అన్నాడు: నాగార్జున భావోద్వేగం

  • వారం క్రితం హరికృష్ణ చెప్పిన మాటలివి
  • ఐ మిస్ యూ అన్నా
  • ట్విట్టర్ లో నాగార్జున

"చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు" అని తనతో చివరిగా ఫోన్ లో హరికృష్ణ మాట్లాడారని హీరో నాగార్జున కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. హరికృష్ణ మరణవార్తను తెలుసుకున్న తరువాత, తాను ఒంటరిని అయిపోయినట్టు అనిపిస్తోందని నాగ్ పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం హరికృష్ణ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్న నాగార్జున "ఐ మిస్ యూ అన్నా" అంటూ తన భావోగ్వేగాన్ని వ్యక్తం చేశారు.

కాగా, హరికృష్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీకాంత్, అల్లరి నరేష్, బ్రహ్మాజీ, అనిల్ రావిపూడి, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మాజీ, సాయి ధరమ్ తేజ్, శ్రీనివాసరెడ్డి, గౌతమి, మంచు లక్ష్మి, గోపీచంద్ మలినేని, దేవిశ్రీ ప్రసాద్, మంచు మనోజ్, నివేదా థామస్, అల్లు శిరీష్ తదితరులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్ హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు.

Harikrishna
Nagarjuna
Road Accident
  • Error fetching data: Network response was not ok

More Telugu News