Nandamuri Harikrishna: భర్త క్షేమంగా ఇంటికి రావాలని హరికృష్ణ భార్య లక్ష్మి పూజలు... విషయం ఇంకా చెప్పని బంధువులు!

  • గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారని మాత్రమే చెప్పిన బంధువులు
  • ఒక్కొక్కరుగా వస్తున్న బంధువులను చూసి ఆందోళనలో లక్ష్మి
  • హరికృష్ణ మృతితో విషాదఛాయలు

నందమూరి హరికృష్ణ మృతితో ఆయన ఇంట విషాదఛాయలు అలముకోగా, విషయాన్ని ఆయన భార్య లక్ష్మికి ఇంకా చెప్పలేదని తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందని, స్వల్ప గాయాలతో హాస్పిటల్ లో ఉన్నారని మాత్రమే ఆమెకు తెలుసు. ప్రమాద వార్తను తెలుసుకున్న కల్యాణ్ రామ్, ఆ విషయాన్ని తన తల్లికి చేరవేసి, హుటాహుటిన తన సోదరుడు ఎన్టీఆర్ తో కలసి ఆసుపత్రికి బయలుదేరి వెళ్లగా, అప్పటి నుంచి తన భర్త క్షేమంగా రావాలని ఆమె ఇంట్లోని పూజ గదిలోనే కూర్చుని ఉన్నారని ఇంటి స్టాఫ్ చెబుతున్నారు. ఒక్కొక్కరుగా వస్తున్న బంధుమిత్రులు కూడా ఇంతవరకూ ఆమెకు విషయం చెప్పలేదు. ఏం జరిగిందోనన్న తీవ్ర ఆందోళనలోనే లక్ష్మి ఉన్నారని తెలుస్తోంది.

Nandamuri Harikrishna
Lakshmi
Wifr
Road Accident
  • Loading...

More Telugu News