Anantapur District: అనంతపురంలో నిత్య పెళ్లి కూతురు.. ఏడడుగులు.. ఏడు పెళ్లిళ్లు!

  • పెళ్లి పేరుతో యువకులను బురిడీ కొట్టించిన యువతి
  • ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడిన వైనం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు?

అనంతపురంలో ఓ మహిళ నిత్య పెళ్లికూతురైంది. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా మొత్తం ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె బాగోతం తాజాగా బయటపడి సంచలనమైంది. జిల్లాలోని వజ్రకరూరు మండలానికి చెందిన ఓ యువకుడికి తిరుపతిలో పరిచయమైన యువతి తాను ఇంజినీర్‌నని పరిచయం చేసుకుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మూడు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల వీరి మధ్య విభేదాలు రావడంతో, భర్త ఆమె గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన ఓ యువకుడిని 8 నెలల క్రితం పెళ్లాడిన సదరు యువతి కలహాల కారణంగా అతడి నుంచి విడిపోయింది. అయితే, విడాకులు తీసుకోకుండానే వజ్రకరూరు మండలానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. అంతకంటే ముందు గోరంట్లకు చెందిన ఓ యువకుడిని, గుంటూరులో మరో యువకుడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా పెళ్లి పేరుతో మరో ముగ్గురిని మోసం చేసింది. ఆమె మోసం వెలుగుచూడడంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.

Anantapur District
Marriage
Andhra Pradesh
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News