Harikrishna: వేగంగా వాహనం నడపడంలో సిద్ధహస్తుడు నందమూరి హరికృష్ణ!

  • నాడు ఎన్టీఆర్ చైతన్య రథానికి సారథి
  • ఎక్కడికి వెళ్లినా స్టీరింగ్ ఆయన చేతుల్లోనే
  • వాహనం నడపడం ఇష్టమని చెప్పే హరికృష్ణ

అది కారుగానీ, వ్యాన్ గానీ, లారీగానీ... ఏదైనా సరే నడపడంలో సిద్ధహస్తుడు నందమూరి హరికృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వేళ, చైతన్య రథానికి సారథిగా నిలిచి వేల కిలోమీటర్ల దూరాన్ని అత్యంత సునాయాసంగా నడిపారు. ఎక్కడికైనా ప్రయాణాలు పెట్టుకున్నా, ఎవరి ఇంటికైనా బయలుదేరినా, స్టీరింగ్ ను తన చేతుల్లోకి తీసుకోవడం ఆయనకున్న అలవాటు. అదే అలవాటు ఇప్పుడాయన ప్రాణాలు తీసింది.

కారును ఎంత వేగంగానైనా అత్యంత చాకచక్యంగా నడిపే ఆయన కారు ప్రమాదానికి గురైందంటే, అభిమానులు నమ్మలేకున్నారు. తన కుమారుడు ఎన్టీఆర్ ను కారులో పక్కన కూర్చోబెట్టుకుని హరికృష్ణ కారును నడుపుతూ రావడం ఎన్నోమార్లు మీడియాకు కనిపించింది. వాహనం నడపటం తనకెంతో ఇష్టమైన పనని చెప్పే ఆయన, తన సొంత ఫార్చ్యూనర్ కారు (ఏపీ 28 బీడబ్ల్యూ 2323)లో వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఇంత ఘోరాన్ని నమ్మలేకున్నామని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

Harikrishna
NTR
Road Accident
  • Loading...

More Telugu News