Harikrishna: తండ్రి మరణంతో కన్నీరు మున్నీరైన జూనియర్ ఎన్టీఆర్!

  • ఉదయం 7.30 గంటలకు హరికృష్ణ మృతి
  • అప్పటికే ఆసుపత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • దుర్వార్త విని శోకసంద్రంలో నందమూరి ఫ్యామిలీ

తన తండ్రి మరణవార్తను తెలుసుకున్న హీరో ఎన్టీఆర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి తన సొంత కారులో బయలుదేరిన హరికృష్ణ, ఆపై గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కారు ప్రమాద వార్తను తెలుసుకున్న ఎన్టీఆర్, తన సోదరుడు కల్యాణ్ రామ్ తో కలసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆయన పరిస్థితి అత్యంత విషమమని వైద్యులు స్పష్టం చేయడం, మరికొన్ని నిమిషాలకే, దుర్వార్తను ఆయన చెవిన వేయడంతో తండ్రి మృతదేహాన్ని చూస్తూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు బోరున విలపించారు.

Harikrishna
NTR
Kalyanram
Road Accident
  • Loading...

More Telugu News