NTR: ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు, లోకేశ్

  • అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు
  • బయలుదేరిన చంద్రబాబు, లోకేశ్
  • ఆసుపత్రికి చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

నందమూరి హరికృష్ణకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈరోజు నిర్దేశించుకున్న అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఇరువురూ ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరారు. మరికాసేపట్లో వారు నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి నేరుగా చేరుకుని హరికృష్ణను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆయనకు జరుగుతున్న చికిత్స, గాయాల తీవ్రతపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

NTR
Kalyan Ram
Chandrababu
Lokesh
Harikrishna
  • Loading...

More Telugu News