NTR: రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణకు తీవ్రగాయాలు!

  • నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ప్రమాదం
  • నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రికి బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఆర్‌ కుమారుడు, నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఆయనను నార్కట్‌ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తన అభిమాని మోహన్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వెళ్లేందుకు ఆయన బయలుదేరినట్టు తెలుస్తోంది. తమ తండ్రికి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు హుటాహుటిన కామినేని ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.

NTR
Harikrishna
Road Accident
  • Loading...

More Telugu News