Akhila priya: నేడు మంత్రి అఖిల ప్రియ వివాహం.. హాజరుకానున్న గవర్నర్ నరసింహన్, చంద్రబాబు

  • పారిశ్రామికవేత్త భార్గవ్‌ను పెళ్లాడనున్న అఖిల ప్రియ
  • మంగళవారం మెహందీ ఫంక్షన్
  • హాజరుకానున్న పలువురు ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ-పారిశ్రామికవేత్త మద్దూరు భార్గవ్ రామ్ నాయుడుల వివాహం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా పలువురు మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం కోటకందుకూరు మెట్టు వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వివాహం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజుల క్రితం అఖిల ప్రియను పెళ్లికుమార్తెను చేయగా, మంగళవారం మెహందీ వేడుక నిర్వహించారు.

Akhila priya
Minister
Andhra Pradesh
Bhargav ram naidu
Marriage
Kurnool District
  • Loading...

More Telugu News