kcr: గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ

  • రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్
  • ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావన
  • ఈ భేటీపై రాజకీయవర్గాల్లో చర్చ

గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఈరోజు రాజ్ భవన్లో  భేటీ అయ్యారు. తన ఢిల్లీ పర్యటన విశేషాలను గవర్నర్ కు తెలిపినట్టు సమాచారం. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ విధానం అమలుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడం, ఈ విధానం అమలు నిబంధనల రూపకల్పన, హైకోర్టు విభజనకు కేంద్రం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆయనకు కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాగా, ‘తెలంగాణ’లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో గవర్నర్ ని కేసీఆర్ కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

kcr
governor narasimhan
  • Loading...

More Telugu News