ntr: 'ఎన్టీఆర్' బయోపిక్ లో మరో నందమూరి హీరో

  • హరికృష్ణ పాత్రను పోషించనున్న కల్యాణ్ రామ్
  • ఫిలిం నగర్ లో వైరల్ అవుతున్న వార్త
  • అధికారికంగా ఇంకా వెలువడని ప్రకటన

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పలువురు స్టార్లు నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ పాత్రను ఆయన కుమారుడు నందమూరి కల్యాణ్ రామ్ పోషించనున్నాడట. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో, హరికృష్ణ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... కల్యాణ్ రామ్ నటించడం ఖరారైందని సమాచారం.

ntr
Balakrishna
harikrishna
kalyanram
  • Loading...

More Telugu News