CPI Narayana: ఈ విషయంలో మాత్రం కేసీఆర్ ను మెచ్చుకోవాలి: నారాయణ

  • కేరళకు బీజేపీ పాలిత రాష్ట్రాలు సాయం చేయలేదు
  • యూఏఈ సాయాన్ని కేంద్రం అడ్డుకోవడం దారుణం
  • కేరళకు సాయం అందించిన కేసీఆర్ ను మెచ్చుకోవాలి

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు కేరళకు సాయం అందించాయని సీపీఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేరళకు సాయం చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. దీంతోపాటు యూఏఈ అందించాలనుకున్న భారీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం కూడా అత్యంత దారుణమని అన్నారు. కేరళకు సాయం అందించిన కేసీఆర్ ను మెచ్చుకోవాలని చెప్పారు.

కేరళ వరద బాధితుల కోసం సీపీఐ నేతలు, కార్యకర్తలు బియ్యం, సరుకులు, మందులు, బట్టలు, విరాళాలను సేకరించారు. వీటన్నింటినీ ప్రత్యేక వాహనాల్లో కేరళకు పంపించారు. ఈ వాహనాలకు నారాయణ జెండా ఊపి పంపారు.

CPI Narayana
kcr
kerala
  • Loading...

More Telugu News