stalin: నాకు చెల్లెలు మాత్రమే ఉంది.. అన్నయ్య లేడు!: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

  • డీఎంకేలోకి రావాలనుకున్న అళగిరికి నిరాశ
  • తనకు అన్నయ్యే లేడని స్పష్టం చేసిన స్టాలిన్
  • తండ్రి మరణానంతరం స్టాలిన్ కు మద్దతు తెలిపిన కనిమొళి

డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, తనకు చెల్లెలు (కనిమొళి) మాత్రమే ఉందని, అన్నయ్య (అళగిరి) లేడని అన్నారు. కరుణానిధి ఉన్న సమయంలోనే పార్టీ నుంచి అళగిరిని బహిష్కరించారు. కరుణ మరణానంతం పార్టీలోకి తిరిగి వచ్చేందుకు అళగిరి తీవ్ర ప్రయత్నం చేశారు. తనను తీసుకోకపోతే ఏం జరుగుతుందో చూడాలంటూ... పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే, తనకు అన్నయ్యే లేడని స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టాలిన్ సోదరి కనిమొళి డీఎంకే రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తండ్రి మరణానంతం స్టాలిన్ నాయకత్వానికే కనిమొళి మద్దతు తెలిపారు. స్టాలిన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, డీఎంకేలోకి వచ్చేందుకు అళగిరికి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టైంది. ఈ నేపథ్యంలో, ఆయన ఏం చేయబోతున్నారో వేచి చూడాలి.

stalin
alagiri
kanimozhi
dmk
president
  • Loading...

More Telugu News