rasi khanna: ఓ క్రికెటర్ తో నాకు ముడిపెట్టారు: రాశీ ఖన్నా ఆవేదన

  • హీరోలతో అఫైర్లు ఉన్నాయనే వార్తలకు అంతే లేదు
  • అందరితో నాకు స్నేహపూర్వక సంబంధాలు మాత్రమే ఉన్నాయి
  • బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదు

ఎవరెవరితోనే ప్రేమాయణం నడుపుతున్నానంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ రాశీఖన్నా ఆవేదన వ్యక్తం చేసింది. తనతో కలసి నటించే హీరోలతో అఫైర్లు ఉన్నాయనే వార్తలకు అంతే ఉండటం లేదని చెప్పింది. మొన్నామధ్య ఓ క్రికెటర్ ఆట అంటే తనకు ఇష్టమని చెప్పానని... దీంతో, అతడిని ప్రేమిస్తున్నానంటూ వార్తలు పుట్టుకొచ్చేశాయని తెలిపింది. తనతో నటించేవారందరితో తనకు స్నేహపూర్వక సంబంధాలు మాత్రమే ఉంటాయని... ఇలాంటి వార్తలను పుట్టించేవారు అనుకుంటున్న సంబంధాలు ఉండవని చెప్పింది. దక్షిణాదిన తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని... బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన తనకు లేదని తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా మంచి అవకాశం వస్తే, బాలీవుడ్ లో నటిస్తానేమో అని చెప్పింది.

rasi khanna
tollywood
love affairs
  • Loading...

More Telugu News