kodandaram: కోట్లు చేతులు మారుతున్నాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: కోదండరామ్

  • ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి
  • హడావుడిగా ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు
  • నేల మాళిగల్లో దాగిన ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు

ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదందరామ్ డిమాండ్ చేశారు. హడావుడిగా ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని... ఫైళ్ల క్లియరెన్స్ లలో కోట్లు చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇన్ని రోజులు సచివాలయం ముఖం కూడా చూడని వారు... ఇప్పుడు ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారని చెప్పారు. నేల మాళిగల్లో దాగిన ఫైళ్లపై ఇప్పుడెందుకు సంతకాలు పెడుతున్నారని ప్రశ్నించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. 

kodandaram
telangana jana samithi
elections
governor
  • Loading...

More Telugu News