Andhra Pradesh: తన రాజకీయ రంగ ప్రవేశంపై మాజీ డీజీపీ సాంబశివరావు స్పందన!

  • మర్యాదపూర్వకంగానే చంద్రబాబుతో భేటీ
  • ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు
  • ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే శక్తి లేదు
  • మీడియాతో మాట్లాడిన సాంబశివరావు

ఈ ఉదయం అమరావతికి వచ్చి, ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో చర్చించిన మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, బయట తనకోసం వేచివున్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును తాను మర్యాద పూర్వకంగానే కలిశానని తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై మీడియా ప్రశ్నించగా, తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశమూ లేదని తేల్చి చెప్పారు.

పోర్టు అభివృద్ధి, సాగరమాల ప్రాజెక్టులపై మాట్లాడేందుకే చంద్రబాబు వద్దకు వచ్చానని అన్నారు. రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, సాంబశివరావు వైసీపీలో చేరుతారని చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించిన ఆయన, జగన్ ను కూడా తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, విజయసాయి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ తాను ఏ పార్టీలో చేరబోనని అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడే శక్తి తనకు లేదని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Chandrababu
Jagan
Sambasivarao
Amaravati
  • Loading...

More Telugu News