Surya: వేల మంది ఫ్యాన్స్ దూసుకు రావడంతో.. రాజమహేంద్రవరంలో ఆగిపోయిన హీరో సూర్య షూటింగ్!

  • తూర్పు గోదావరి జిల్లాలో షూటింగ్
  • అభిమానులను అదుపు చేయలేకపోయిన సెక్యూరిటీ
  • షూటింగ్ ఆపేశామన్న దర్శకుడు సెల్వ రాఘవన్

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రాంతంలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న దాదాపు 5 వేల మంది ఫ్యాన్స్ ఆ ప్రాంతానికి దూసుకు రావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

 తమిళ హీరోకు ఏపీలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటాన్ని చూసి సినిమా బృందం షాక్ చెందిందట. ఆయన సెక్యూరిటీ అభిమానులను అదుపు చేయడంలో విఫలం అయ్యారట. ఈ విషయాన్ని తన బ్లాగ్ లో స్వయంగా తెలియజేసిన దర్శకుడు సెల్వరాఘవన్, సూర్య అభిమాన గణాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. తన ఫ్యాన్స్ హంగామాను చూసి క్యారవాన్ దిగిన సూర్య, పలువురిని ఆప్యాయంగా పలకరించి, కొందరితో సెల్ఫీలు దిగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Surya
Tamil
Andhra Pradesh
Rajamahendravaram
Shooting
Fans
Selva Raghavan
  • Loading...

More Telugu News