jayasudha: నా అసలుపేరు సుజాత .. సినిమాల్లోకి వచ్చాక మార్చారు: సహజనటి జయసుధ

  • నిన్నటితరం స్టార్ హీరోయిన్ 
  • అగ్ర హీరోల జోడీగా అనేక చిత్రాలు
  • సహజనటిగా అభిమానుల మనసుల్లో స్థానం  

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం కథానాయికలలో జయసుధ ఒకరు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణ సరసన కథానాయికగా ఆమె అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. సహజ నటిగా ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి జయసుధ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

 "నా అసలు పేరు సుజాత .. నేను పుట్టినప్పుడు 's' అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టాలని మా పేరెంట్స్ కి ఎవరో చెప్పారట. దాంతో ముందుగా 'సుభద్ర' అని అనుకున్నారట .. అది ఆ తరువాత 'సుజాత'గా మారింది. నేను సినిమాల్లోకి వచ్చాక .. ఆల్రెడీ ఒక సుజాత ఫీల్డ్ లో ఉండటంతో, ఒక తమిళ నిర్మాత నా పేరును 'జయసుధ' గా మార్చారు. అప్పటి నుంచి జయసుధగానే కొనసాగాను" అంటూ చెప్పుకొచ్చారు.  

jayasudha
ali
  • Loading...

More Telugu News