NaaraHamaaraTelugudesamHamaara: ‘నారా హమారా-టీడీపీ హమారా‘కు తరలిరండి: ఎంపీ గల్లా జయదేవ్ పిలుపు

  • గుంటూరులో భారీ బహిరంగ సభ
  • ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం
  • హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఈ రోజు గుంటూరులో నిర్వహిస్తున్న ‘నారా హమారా-టీడీపీ హమారా’ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎంపీ గల్లా జయదేవ్ పిలుపునిచ్చారు. ఇక్కడి బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు జయదేవ్ ట్విట్టర్ లో కార్యక్రమ వివరాలను తెలిపారు.

రాష్ట్రంలోని ముస్లిం సోదరుల కోసం ప్రభుత్వం నారా హమారా-టీడీపీ హమారా పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నాయకులు వివిధ కమిటీలుగా ఏర్పడి పని చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నారా హమారా-టీడీపీ హమారా కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ప్రాంగణానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. సభా ప్రాంగణంలోనే ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


కాగా, సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ పలువురు హాజరయ్యే అవకాశం ఉండటంతో ట్రాఫిక్, పార్కింగ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బస్సులను పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కాలేజ్ లో, కార్లు, టూ వీలర్స్ ను గుంటూరులోని పాత బస్టాండ్, గుంట గ్రౌండ్ లలో పార్కింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

NaaraHamaaraTelugudesamHamaara
galla jayadev
Guntur District
muslim meet
  • Loading...

More Telugu News