Tai Zu Ing: తైజూ చేతిలో వరుసగా పదోసారి ఓటమి తరువాత సైనా నెహ్వాల్ స్పందన!

  • వరల్డ్ నంబర్ వన్ తైజూ ఇంగ్
  • ఆమె ఆట ఊహకందనిది
  • అర్థం చేసుకునేలోపే కొత్త షాట్ తో వస్తుందన్న సైనా నెహ్వాల్

తైజు ఇంగ్... ప్రపంచ బ్యాడ్మింటన్ రంగంలో ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్. ఆమె తన వైవిధ్యమైన ఆటతో, ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తుంది. భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ను ఆమె వరుసగా ఓడిస్తోంది. ఒకసారో, రెండుసార్లో కాదు వరుసగా పది సార్లు తైజు చేతిలో ఓడిపోయింది. తాజాగా, నిన్న ఆసియా క్రీడల సెమీస్ లో ఆమె చేతిలో ఓడిపోయింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన సైనా, ఆమె ఊహకందని వైఖరి తనకు అర్థం కావడం లేదని వాపోయింది. తైజూతో జరిగే మ్యాచ్ లో షాట్ల ఎంపిక, ర్యాలీలను ముగించడంలో తాను మరింత చురుకుగా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఆమె ప్రతి ర్యాలీ విభిన్నంగానే ఉంటుందని, ఆమె వద్ద మరిన్ని భిన్నమైన షాట్లు ఉండి ఉండవచ్చని చెప్పింది. తైజూ ఓ కొరకరాని కొయ్యని అభిప్రాయపడ్డ సైనా, సెమీస్ లో తాను పోరాడానని చెప్పింది. తన షాట్ ను అర్థం చేసుకునేలోపే, కొత్త షాట్ తో విరుచుకుపడుతుందని చెప్పింది. ఇక ఫైనల్ లో తైజుతో సింధుకు 50-50 చాన్సులున్నాయని చెప్పింది.

Tai Zu Ing
Saina Nehwal
Asian Games
Badminton
  • Loading...

More Telugu News