Hyderabad: కస్టమర్లలా వెళ్లిన పోలీసులు.. అమ్మాయితో మసాజ్ ఆఫర్... ఆటకట్టు!

  • పైకి సెలూన్, లోపల క్రాస్ మసాజ్
  • హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ఘటన
  • నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

పైకి సెలూన్ ముసుగు. లోపల జరుగుతున్నది క్రాస్ మసాజ్, వ్యభిచారం. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు, సాధారణ కస్టమర్లలా వెళ్లి ఆటకట్టించిన ఘటన హైదరాబాద్, ఏఎస్ రావు నగర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి రిలయన్స్ ఫ్రెష్ పై అంతస్తులో ఫౌంటెయిన్ సెలూన్ అండ్ స్పా నిర్వహిస్తున్నారు. ఇది అనుమతి లేకుండా నడుస్తోంది.

బోయిన్ పల్లికి చెందిన దురాయ్ రాజ్ గణేష్ అనే యువకుడు, ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెచ్చి వారితో పురుషులకు మసాజ్ చేయిస్తున్నాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించాడు. అందులో అందమైన అమ్మాయిల ఫొటోలను ఉంచి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అతని నిర్వాకంపై విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీసీ పోలీసులు, కస్టమర్లలా వెళ్లారు. వారికి కూకట్ పల్లికి చెందిన ఓ యువతితో మసాజ్ చేయించే ప్రయత్నం చేశాడు గణేష్. దాంతో ఆ యువతిని, నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.

Hyderabad
Massage
Cross Massage
Spa
Police
Arrest
  • Loading...

More Telugu News