Santosham: ఈ అవార్డును మరొకరి ద్వారా ఇప్పించుంటే తిరస్కరించేవాడిని!: 'సంతోషం' అవార్డుల వేడుకలో చిరంజీవి!

- చిరంజీవికి 'సంతోషం' అవార్డు
- అవార్డును అందించిన గానకోకిల ఎస్ జానకి
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
"నాకు అవార్డు ఇస్తానని అంటే వేడుకకు రాను. ఇవ్వబోనని చెబితేనే వస్తానని సురేశ్ కు ముందే చెప్పాను. కానీ, నన్ను మోసం చేసి, గానకోకిల ఎస్ జానకి చేతుల మీదుగా అవార్డు ఇప్పించి, నన్ను లాక్ చేశాడు. కాదనలేకపోతున్నా" అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. 16వ సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లో జరుగగా, చిరంజీవి మాట్లాడారు.

