Tirumala: సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కారుకు ప్రమాదం.. డ్రైవర్ కు తీవ్రగాయాలు!

  • తిరుమలకు వెళుతుండగా ప్రమాదం
  • రాఘవేంద్రరావు వ్యక్తిగత సిబ్బందికి గాయాలు
  • స్విమ్స్ ఆసుపత్రికి డ్రైవర్ తరలింపు

ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కారు ప్రమాదానికి గురైంది. తిరుమలకు వెళ్తుండగా మొదటి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పిట్ట గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రాఘవేంద్రరావు వ్యక్తిగత సహాయ సిబ్బంది మురళి, సుమన్, డ్రైవర్ బాలాజీకి గాయాలయ్యాయి. బాలాజీకి తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన కారులో రాఘవేంద్రరావు లేరు. మరో కారులో ఆయన తిరుమలకు వెళ్తుండటం గమనార్హం.

Tirumala
director
raghavendra
  • Loading...

More Telugu News