kondru murali: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా.. తెలుగు తమ్ముళ్లు సహకరించాలి: కొండ్రు మురళి

  • 31న అమరావతిలో టీడీపీలో చేరుతున్నా
  • చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది
  • చంద్రబాబు పని తీరు నచ్చి టీడీపీలో చేరుతున్నా

తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్... టీడీపీ శ్రేణులతో కలసిపోయేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. టీడీపీలో చేరే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావులను కలిశానని... సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, దీంతో, ఈ నెల 31న అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నానని ఆయన తెలిపారు. తనకు టీడీపీ శ్రేణులు సహకరించాలని విన్నవించారు.

రాష్ట్ర విభజన కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి చంద్రబాబు తీసుకెళ్లారని కొండ్రు తెలిపారు. చంద్రబాబు పనితీరుకు ఆకర్షితుడనై టీడీపీలో చేరుతున్నానని చెప్పారు.

kondru murali
Chandrababu
Telugudesam
joining
  • Loading...

More Telugu News