vijaydevarakonda: 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'గీత గోవిందం'

  • రెండు వారల క్రితం వచ్చిన 'గీత గోవిందం'
  • అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం
  • నైజామ్ లో 16 కోట్లకి పైగా షేర్  

విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తోంది. తొలి అయిదు రొజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టొచ్చుననీ, 100 కోట్ల వరకూ వెళ్లకపోవచ్చుననే ప్రచారం జరిగింది.

కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇంతవరకూ 16 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ వారం విడుదలవుతోన్న 'నర్తనశాల' .. 'పేపర్ బాయ్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ప్రభావితం చేయలేకపోతే, 'గీతగోవిందం' 125 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News