Revanth Reddy: రేవంత్ రెడ్డి ఓ గాలి నాయకుడు: కర్నె ప్రభాకర్

  • మేము ప్రజలను నమ్ముకున్నాం
  • దోచుకున్న డబ్బును కాంగ్రెస్ నమ్ముకుంది
  • అధికారంపై కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ గాలి పార్టీ అని, ఆ పార్టీలో రేవంత్ రెడ్డి ఓ గాలి నాయకుడని వ్యాఖ్యానించారు. తాము ప్రజలను నమ్ముకున్నామని, కాంగ్రెస్ పార్టీ దోచుకున్న డబ్బును నమ్ముకుందని విమర్శించారు. ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చామంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమపై చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గోదావరిలో నీటి లభ్యత ఎంతో కూడా ఉత్తమ్ కు తెలియదని అన్నారు. అధికారంపై కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

Revanth Reddy
karne prabhakar
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News