మా కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి: మీనా
- నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు
- వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలి
- అరవిందస్వామితో నటించలేక పోయా
తన కెరీర్ లో తాను అగ్ర నటులందరితో నటించానని.... అరవిందస్వామితో మాత్రం నటించలేకపోయానని మీనా తెలిపింది. ఆయనతో నటించే అవకాశం వచ్చినా, కాల్షీట్స్ సమస్య కారణంగా అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. విజయ్ తో చాలా చిత్రాలు కమిట్ అయి కూడా నటించలేకపోయానని తెలిపింది. విజయ్ తో నటించలేక పోయాననే కొరతను తీర్చుకోవడానికే 'షాజహాన్' చిత్రంలో ఆయనతో కలసి ఓ పాటలో నటించానని చెప్పింది.