stalin: సోదరా స్టాలిన్! నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని నా ఆశ: మోహన్ బాబు

  • కరుణానిధి సంస్మరణ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు
  • తనను కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపిన డైలాగ్ కింగ్
  • కరుణ ఒక గొప్ప తండ్రి అంటూ కితాబు

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలనేదే తన కోరిక అని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అభిలషించారు. కోయంబత్తూరులో జరిగిన దివంగత కరుణానిధి సంస్మరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరుణ ఒక గొప్ప లెజెండరీ ఫాదర్ అని కితాబిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కరుణానిధితో, ఆయన కుటుంబంతో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. తమిళనాడులో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పటి నుంచే కరుణతో మోహన్ బాబుకు పరిచయం ఉంది. ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాదుకు తరలి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. మోహన్ బాబు సినిమా కార్యక్రమాలకు కూడా కరుణ హాజరైన సందర్భాలు ఉన్నాయి.

stalin
mohan babu
karunanidhi
condolence meeting
coimbatore
  • Loading...

More Telugu News